Tuesday, December 09, 2008

మరవలేని అనుభవం వైజాగ్, అరకు ట్రిప్ (దృశ్యమాలిక)


పచ్చదనాన్ని కప్పుకుని ఆకసాన్నంటే గిరులు ఓ వైపు.. అబ్బురపరిచే లోయలు మరో వైపు.. తాచుపాములా మెలికలు తిరిగే సన్నని దారీ.. కళ్లు విప్పార్చుకుని చూసినా కళ్లల్లో ఇమిడిపోలేనన్ని అందాలు..

ఆహ్లాదంగా సాగిన అరకు విహారయాత్ర మిగిల్చిన అనుభవం ఇది. గత నెల 15వ తేదీ నుండి కంప్యూటర్ ఎరా డిసెంబర్ మేగజైన్ ప్రిపరేషన్ వత్తిడిలో బ్లాగుకి దూరంగా ఉన్నాను. అది ప్రింటింగ్ కి పంపిన తర్వాత ప్లాన్ చేసుకున్న ఈ ట్రిప్ ఇలాంటి వత్తిడుల నుండి ఎంతో రిలీఫ్ ని అందించడమే కాకుండా కొంగొత్త ఉత్సాహాన్నిచ్చింది. వైజాగ్ లోని రామకృష్ణ బీచ్, రుషికొండ లో బోట్ షికార్, కైలాసగిరి, యారాడ బీచ్, అరకు, సింహాచలం తదితర ప్రదేశాలను తీరికగా చూసే భాగ్యం ఇన్నాళ్లకు కలిగింది. ఆ అద్భుత ప్రదేశాలన్నీ కళ్లెదుట ఊరిస్తుంటే ఓపిగ్గా మరీ 6.5GBకి పైగా ఫొటోలు, వీడియోలు కెమెరాలో భద్రపరుచుకుని మళ్లీ మళ్లీ చూడడం మరో చక్కని అనుభవం. బ్లాగు మిత్రులతో ఈ ట్రిప్ లోని కొన్ని ఫొటోలు, థింసా డాన్స్ లో చిన్న వీడియో క్లిప్ ని ఈ పోస్ట్ లో షేర్ చేసుకుంటాను. బ్లాగర్ లో ఉన్న పరిమితుల వల్ల తక్కువ క్వాలిటీ ఇమేజ్ లను, పేజ్ లోడింగ్ కి ఎక్కువ సమయం పట్టకుండా తక్కువ ఇమేజ్ లను మాత్రమే ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఏదైనా ఇమేజ్ ని పెద్దదిగా చూడాలంటే ఆ ఇమేజ్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది.







9 comments:

శ్రీ said...

మీ టెంప్లేట్ అదిరింది. టపా నిదానంగా చదివి మళ్ళీ కామెంటుతాను.

చిలమకూరు విజయమోహన్ said...

మీరు తీసిన దృశ్యాలు చాలా బాగున్నాయి.

prasanna said...

template chala bavundandi,alage photos kuda..

ఉమాశంకర్ said...

బాగున్నాయ్ మీ ట్రిప్ ఫోటోలు...నేను ఎప్పట్నించో అనుకుంటూ ఇప్పటివరకు చూడలేకపోయిన వాటిల్లో అరకు ఒకటి.

శ్రీ said...

బాగుంది మీ అరకు విశేషాలు! నేను ఇంతవరకు సినిమాల్లో, ఫొటోలలోనే చూడడం అరకు గురించి.

Srinivas said...

ముందుగా మీ మిత్రులందరితో షేర్ చేసుకొవాలని ఈ పోస్ట్ వేసినందకు ధన్యవాదాలు. నిజంగా చాలా చక్కని దృశ్యాలను మా కళ్ల ముందుంచారు.

Anonymous said...

మూస, ఫోటోలు రెండూ బావున్నాయ్..

lahari.com said...

మనసులొ అన్న బ్లాగులోని అరకులోని చిత్రాలు చాలా బాగున్నాయి. నేను మా అమ్మ అరకు వెళ్ళిన విషయాలు నాకు గుర్తుకువస్తున్నాయి . ఆ తీపి ఙ్ పకాలు. అక్కడ మిరియాల తొటలు, ఆ దారి హెర్పిన్ మోడల్లొ ఉంటుంధి. చాల్ల భయం వెస్తుంధి. కాని చాలా సరదాగా వుంటుంధి. అందాలన్ని అక్కడె వున్నయా అని పిస్తుంధి. బొర్రకెవెస్ , పద్మాలయ గర్డన్స్ , అనంతగిరి ,ధింసా నౄత్యం , ఆట్రైన్ ప్రయాణం చాలా బాగుంటాయి . మీ వల్ల నా మనసులొ సంతొషమైన రొజులు గుర్తుకొస్థున్నయి . మీకు నా thanks uncle.

Ramani Rao said...

నేను వెళ్ళాను వైజాగ్ కాని ఒక్క అరకు తప్ప అన్నీ చూసానండి. ఫోటోలు చాలా బాగున్నాయి.

"మన జ్ఞానాన్ని ఇతరులకి పంచగలము కాని, మన అనుభవాన్నిఆనుభూతుల్ని పంచలేమట. "-చలం

నిజమే కదా! కాని ఫొటోల ద్వారా మీ ఆనందానుభవాల్ని బ్లాగు మిత్రులతో షేర్ చేసుకొనే ప్రయత్నము చాలా బాగుంది.