Monday, November 24, 2008

సినిమా మనిషి కబుర్లు - చిరంజీవి ఎమోషన్స్ వక్రీకరించబడిన ఉదంతం

సినీ తారల మాటలు, ఎమోషన్స్ ఎంత వక్రీకరించబడతాయో, ఒక్కోసారి ఎంత వివాదాస్పదం అవుతాయో ఓ చిన్న ఉదాహరణ ప్రస్తావిస్తూ ఈ "సినిమా మనిషి కబుర్లు" సీరియల్ ప్రారంభిస్తాను.

ఆరోజు చెన్నైలో దాసరి అరుణ్ కుమార్ "గ్రీకు వీరుడు" ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ తరలిపోతున్న తరుణం అది. అప్పటికీ 30-40% షూటింగ్ లు, 90 శాతానికి పైగా రికార్డింగ్ లు చెన్నైలో జరుగుతూ ఉన్నాయి. ఆడియో ఫంక్షన్ కి చిరంజీవి గారు, అల్లు రామలింగయ్య, భానుచందర్ మరికొందరు నటీనటులు, టెక్నీషియన్స్ హాజరయ్యారు. చిరంజీవి గారు రావడం రావడం దాసరి దంపతుల్ని, అరుణుకుమార్ ని, ఇతర నటీనటులను తనదైన శైలిలో విష్ చేసి.. జర్నలిస్టులమైన మావద్దకు వచ్చారు. పసుపులేటి రామారావు, జగన్, మణిగోపాల్ (ఇప్పుడు పేరు మార్చుకుని ఓ ప్రముఖ గేయ రచయిత అయ్యారు), ఉమామహేశ్వరరావు తదితరులతో కూడిన బృందం మాది. అప్పటికి కొద్దిరోజుల ముందు చిరంజీవి షూటింగులకు ఇబ్బంది అవుతున్న రీత్యా అక్కడే ఇల్లు తీసుకుని హైదరాబాద్ కి మకాం మార్చారు.
చెన్నై సినిమా జర్నలిస్టులతో ఆయనకు సాన్నిహిత్యం ఎక్కువ. చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఎన్నో సంవత్సరాల పాటు ఓ కుటుంబంలా అనేక ఫంక్షన్లలో కలిసి కబుర్లు చెప్పుకునే జర్నలిస్ట్ మిత్రులను విడిచి కొత్త ప్రదేశంలో కొత్త జర్నలిస్టులతో పూర్తిగా ప్రొఫెషనల్ గా మారడం ఒక మనిషిగా ఆయనకి బాధనిపించింది. మా సమీపానికి వచ్చి పేరుపేరునా పలకరిస్తూ హత్తుకుంటూ సడన్ గా ఎమోషనల్ అయ్యారు. "మిమ్మల్నందరినీ విడిచి హైదరాబాద్ లో ఉండడం చాలా బాధగా ఉంది.. నేను అక్కడ ఉన్నానే కానీ నా మనసంతా మీ దగ్గరే ఉంది" అంటూ కళ్లు చెమర్చుకున్నారు.
నిజమే కదా.. కొన్నేళ్లపాటు ఒక నగరంతో ముడిపడిన అనుబంధం అక్కడి బంధాలను తెంచుకుని వెళ్లవలసి వస్తే ఎంత బాధ అన్పిస్తుందో కదా! ఎంతటి సెలబ్రిటీ అయినా అలాంటి ఎమోషన్స్ ని ఆత్మీయులు కన్పించినప్పుడు కంట్రోల్ చేసుకోవడం సాధ్యం కాని పని. ఆఫ్ ది రికార్డ్ కాదు. అందులో ఏ విధమైన వివాదమూ లేదు. నేను జరిగింది జరిగినట్లు మా పత్రికలో రాశాను. ఒక సాధారణ హ్యూమన్ బీయింగ్ గా సెలబ్రిటీల ఎమోషన్స్ ని, అదీ మా జర్నలిస్టుల మీద ఎఫెక్షన్ తో బయటపడేసరికి రాయకుండా ఉండలేకపోయాను.

ఇంకేముంది వివాదం మొదలైంది. "చిరంజీవి చెన్నై వెళ్లి కళ్లనీళ్లు పెట్టుకున్నాడట. హైదరాబాద్ కి సినిమా ఫీల్డ్ రావడం ఆయనకు ఇష్టం లేదట.." అంటూ హైదరాబాద్ కోటరీ విచ్చలవిడిగా ఊహాగానాలు ప్రచారం చేస్తూ తమ పత్రికల్లో రాశారు. ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్కరూ చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. ఇక్కడ ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉండాలా, చెన్నైలో ఉండాలా అన్నది కాదు ముఖ్య విషయం. కొన్నేళ్ల పాటు ఒక చోట ఉన్న వ్యక్తి సడన్ గా ప్రదేశం మారేసరికి ఫీలయ్యే అలజడే చిరంజీవి ఫీల్ అయ్యారు. దాన్ని సాటి మనిషిగా అర్థం చేసుకోవడం మానేసి రాజకీయం చేసి చిరంజీవిపై "ఏంటీ హైద్రాబాద్"ముద్ర తగిలించడం బాధేసింది.

ఒక సెలబ్రిటీ తన బాధలను, ఎమోషన్స్ ని స్వేచ్ఛగా express చెయ్యలేనంతగా.. కొండొకచో ఎమోషనల్ అయితే అపార్థాలు తీస్తూ ఎంత ఇరకాటంలో పెడతారో ఈ ఉదాహరణ చూస్తే అర్థమై ఉంటుంది. ఇక్కడ నేను చిరంజీవి అభిమానిని కాదు. అస్సలు నేను జర్నలిస్ట్ గా ఎవరి అభిమానినీ కాదు అన్నది మున్ముందు ఈ సిరీస్ లో రాసే ఇతర "కబుర్లు"ని చదివితే మీకు అర్థమవుతుంది. ఒక human beingగా వారి సమస్యలను సమీపం నుండి గమనించిన తర్వాత.. మనకు ప్రతీరోజూ పేపర్లలో వచ్చే పుకార్ల వంటి వాటిలో ఎంత నిజం ఉంటుందో ఆలోచిస్తారని ఈ అనుభవాన్ని మీతో షేర్ చేసుకున్నాను.

13 comments:

KumarN said...

శ్రీధర్ గారూ,
మీ ఆర్టికల్స్ చాలా రోజుల నుండీ చదూతూ కూడా, ఎప్పుడూ కామెంట్లు వదిలినట్లు లేను.. క్షమించాలి. నా అభిమాన బ్లాగర్లల్లో మీరూ ఒకరు.

మీరు టెక్నికల్ ఆర్టికల్స్ లోనే అనుకున్నా కాని, మీరు క్రొత్తగా చెపుతున్న విషయాల ద్వారా మీ డెప్త్ తెలుసుకోవడం ముచ్చటగా ఉంది. అలాగే మీ ఈ ఫాంట్ మాత్రం, భలే ఉంది. అచ్చం ముత్యాల్లాగా!..అందంగా, పొందిగ్గా, పారిజాతాలేరుకుంటున్న అమ్మాయి చెప్పే కబుర్ల లాగా. చదుతూంటే మరీ చదవాలనిపించేలా ఉంది.

మరే, ఇలా కాంట్రొవర్సీ సృష్టించడం అనేది కూడా ఒక బిజినెస్సే కదండీ..కొన్ని వేల ఉదాహరణలు దొరుకుతాయి ఇలాంటివి. ఆన్ ద సేం టాపిక్.. ఒక ఉదా: ఆ మధ్య ఇక్కడ ప్రసిడెంట్ బుష్ ఫుడ్ గ్రేయిన్స్ షార్టేజ్ గురించి చెపుతా ఓ మాటన్నాడు..అసలాయన మాట్లాడిన ఎగ్జాక్ట్ పదాల్లో కాని, ఆ కంటెక్స్ట్ లో కాని అస్సలే మాత్రమూ తప్పు లేదు. అంత ఎలొక్వెంట్ గా చెప్పలేదంతే..కాని తరవత ఇండియాలో జరిగిన రగడ, ఆ చెత్త కవితలు చూస్తే నాకు సిగ్గేసింది. ఈ క్రింద చదవండి Times loanchi.

President Bush has never been known for his eloquence, but his comment earlier this month that India's growing middle class was demanding "better nutrition and better food, and so demand is high, and that causes the price to go up" was neither particularly mangled nor, at first flush, offensive. In the days since, though, India's most nationalistic politicians, newspapers and television pundits have expressed outrage, calling Bush's comment rude and insensitive. The message from many Indians over the past two weeks has been stark: Americans should stop blaming others and start eating less. To pretend that tens of millions of Chinese and Indians who are joining the middle class every year have no impact on demand for food is downright silly.

సారీ, టాపిక్ మరల్చడం కాదు నా ఉద్దేశం. చెప్పే పాయింటు కరక్ట్ అయ్యినా, పొలిటికల్లీ కరక్ట్ పదాల్లో చెప్పక పోయినా, పక్కనున్న వారెవ్వరో చూసుకోకపోయినా ఇప్పుడున్న మీడియా ప్రపంచంలో ఒక్కోసారి చాలా పెద్ద ప్రైస్ పే చేయక తప్పదు అనేదానికి ఇంకో ఉదా..నిచ్చాను అంతే.

I have another HUGE example which completely derailed and killed(politically) a front-runner presidential candidate in US elections this year, because he said something to our Indian Student. But later..

keep writing

Anil Atluri said...
This comment has been removed by the author.
Ramani Rao said...

టపా మొత్తం చదివిన తరువాత ఇక్కడ మీ అనుభవం గురించి ఆలోచించడం మొదటి పాయింట్., ఇక రెండోది సెలబ్రిటీస్ వాళ్ళ హావభావాలు వాళ్ళు బయటకి ప్రదర్శించకుండా ఉండగలగడం.
నాకెందుకో ఇక్కడ ఓ సినీ మహ కవి చెప్పినట్లు.. "జీవితమే ఒక నాటక రంగం" అన్నది గుర్తొస్తోంది.
మీ అనుభవ పరంగా మీ వైపు నుండి ఆలోచిస్తే మీ నిజాయితి మెచ్చుకోతగ్గది. నిజానికి ఇక్కడ మీకు నటించడం రాలేదు. అంటే "నలుగురితో నారయణ గుంపులో గోవిందా" అని అనడం మీకు రాలేదు. కాని, అక్కడ అవతలి వాళ్ళకి కావాల్సింది, సెలబ్రిటీ, ఆ సెలబ్రిటి ఎమొషనల్ ఫీలింగ్స్ కాదు. వాళ్ళకి కావల్సినది మసాల. అదే కలిపారు వాళ్ళు అందుకే అది వివాదం అయ్యింది.
సో, ఆలోచిస్తే, పెద్ద హోదా కలవాళ్ళ ప్రతి కదలికా "సుడిగాలిలో ఎగిరే పతంగమే", వాళ్ళ "జీవితమంతా ఓ నాటక రంగమే".

ఉమాశంకర్ said...

శ్రీధర్ గారూ,

మీ బ్లాగు బావుంది. మీరు రాయబోయే వాటి గురించి ఆసక్తి గా ఎదురుచూస్తున్నాను.


మీరందరూ దీన్ని వినే ఉంటారు.. వినని వారెవరన్నా ఉంటే వారికోసం..



ఒక స్వామీజీ మొట్టమొదటిసారిగా అమెరికా వొచ్చేరు. ఎయిర్ పోర్టు లో దిగగానే విలేకరు చుట్టుముట్టి ప్రశ్నలు సంధించేసేసారు. పాపం ఆయన వీరందరికీ ఓపిగ్గా సమాధానాలిచ్చారు. ఒక తుంటరి ఇలా అడిగాడు " స్వామీజీ, అమెరికా లో మీరు నైటుక్లబ్బులని కూడా సందర్శిస్తారా?" అని. పాపం ఆయన తెల్లబోయి " నైటుక్లబ్బులా? అవేమిటి?" అన్నాడు.

మరుసటి రోజు వార్త. "అమెరికా కి వచ్చాక స్వామీజీ గారి మొదటి ప్రశ్న. "నైటుక్లబ్బులంటే ఏమిటి?"

మన సినీ ప్రపంచానికొస్తె, పోటీ ఎంతుంటుందో, వక్రీకరణ కూడా అంతే స్థాయిలో ఉంటుంది.. ఏంచేస్తాం?

మధు said...

బాగుంది మీ అనుభవం.

సెలబ్రిటీ స్టాటస్ లు పక్కనపెడితే, ఏ రంగంలోనైనా ఎదుగుతున్నప్పుడు..ఒక మంచి స్టేజ్ కి చేరుకున్నప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం అనిపిస్తుంది నాకైతే.

ప్రతీ మీటింగుల్లోనూ, సభల్లోనూ జనాలు అడుగుతున్నారు కదాని తొడలుగొట్టడం చూస్తే ...ఇన్నేళ్ళ అనుభవంలో వీరు ఏం నేర్చుకున్నారో అర్ధంకాదు.

Unknown said...

misam meliveyyadam magadi lakshnam ani chiranjivi annaduku telugu mahilalanta vonti kali mida lestunnaru, ayina rajakiyala loki vachhina celibraty lu rani gari pyta tolagindanna tappe tolagaledanna tappe.

ప్రియమైన నీకు......... said...

చాలా బాగుంది...మీ వ్యాసం...మణిభూషణ, వనమాలి కదా....?

krishna rao jallipalli said...

good post. waiting for next one.

Anonymous said...

interesting...

Unknown said...

@ కుమార్ గారు నా పోస్ట్ ని సరిగ్గా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు.

@ రమణి గారు చాలా సున్నితమైన అంశాలను వేర్వేరు కోవలకు చెందిన వ్యక్తుల ఎలా స్వీకరిస్తారో బాగా చెప్పారు. ధన్యవాదాలు.

@ ఉమాశంకర్ గారు చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. నాకు తెలిసినవి ఎలాంటి పక్షపాతాలూ లేకుండా తప్పకుండా షేర్ చేసుకుంటాను.

@ మధు గారు నేను రాసిన ఎగ్జాంపుల్ లో అది పబ్లిక్ మీటింగ్ కాదు. సెలబ్రిటీలు ఇతర సందర్భాల్లో ఎలా ఎమోషనల్ అవుతారో, వాటిని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో నేను పాయింట్ చెయ్యలేదు ఈ పోస్టులో. నేను నేరుగా చూసిన అనుభవాన్ని ఇక్కడ రాశాను, తొడగొట్టడం వంటి సంఘటనలను ఈ పోస్ట్ ల ప్రస్తావించడం వల్ల నా వ్యక్తిగతమైన అనుభవం సైడ్ ట్రాక్ అయ్యే అవకాశం ఉంది. మీ సహకారానికి ధన్యవాదాలు

@ రవిగారు, ముందుగా మీ కామెంట్ కి ధన్యవాదాలు. మీసాలు మెలేయడం, తొడగొట్టడం వంటివి నేను రాసిన పోస్ట్ తో సంబంధం లేని విషయాలు. దయచేసి అర్థం చేసుకోగలరు. ధన్యవాదాలు.

@ ప్రియమైన నీకు గారు.. ధన్యవాదాలు. మణిగోపాల్ అని రాయబోయి పొరబాటున మణిభూషణ్ అని రాశాను. అవును మీరన్నట్లు మణిగోపాల్ ఇప్పుడు వనమాలి పేరుతో చలామణి అవుతున్న గేయరచయితే. మంచి స్నేహితుడు.

@ కృష్ణారావు గారు ధన్యవాదాలండీ.

@ రాధిక గారు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైనవి పంచుకుంటాను మున్ముందు.!

మధు said...

అయ్యో నిజమేనండీ, నా వ్యాక్యలు టపాకి సంభందం లేనివి. క్షమించండి.
మీ తరువాయి టపాకై ఎదురుచూస్తున్నాను.

Unknown said...

@ మధు గారు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు.

జ్యోతి said...

శ్రీధర్,,

అంతా బానే ఉంది. మరి నీ టపాలకు లేబిల్స్ (వర్గాలు) ఏవి? పాత టపాలు ఎలా చదవాలి? కాస్త ఈ సంగతి చూడు...