Monday, November 15, 2010

కంప్యూటర్ ని స్పీడప్ చేయడం ఎలా? (తెలుగులో వీడియో వివరణ)

అందరం ఏదో ఒక పని కోసం కంప్యూటర్ వాడుతుంటాం. రోజులు గడిచే కొద్దీ టెంపరరీ ఫైళ్లు పేరుకుని, హార్డ్ డిస్క్ లోని క్లస్టర్లు ఫ్రాగ్ మెంట్ అయి సిస్టమ్ స్లో అవుతుంటుంది. వినడానికి ఇవేవో కఠినమైన పదాల్లా అన్పించినా ఇలా జరక్కుండా అడ్డుకోవడం ఇప్పుడు చెప్పే పద్ధతితో చాలా సులభం. ఇలాంటి పలు సమస్యలను పరిష్కరించడంతో పాటు పిసిని finetune చేసుకునే మార్గం గురించి ఈ క్రింది వీడియోలో కంప్యూటర్ ఎరా తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ వివరిస్తున్నారు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే అర్థమవుతుంది. 2007 నుండి నేను చేసిన మరిన్ని టెక్నికల్ వీడియోలు, నా టెలివిజన్ షోలు చూడాలంటే..
http://youtube.com/nallamothu అనే లింక్ ని క్లిక్ చేయండి.

2 comments:

Sudha Rani Pantula said...

శ్రీధర్ గారు,
మీరు రాసే విషయాలన్నీ చాలా ఆసక్తికరంగా, ఉపయోగపడేలా ఉంటాయి.
కంప్యూటర్ ని స్పీడప్ చేయడం ఎలా అన్న వీడియో తెరవబడడం లేదు(ఓపెన్ కావడంలేదని :))
ఏం చెయ్యమంటారు...

Unknown said...

సుధ గారు, సరిగా అప్ లోడ్ అవకపోవడం వల్ల వేరొక వీడియోని డిలీట్ చేయబోయి, Select allని పొరబాటున క్లిక్ చేసి ఈ స్పీడప్ చేసుకునే వీడియోతో పాటు మరో 90 వీడియోల వరకూ డిలీట్ చేశాను యూట్యూబ్ నుండి. ఓ నాలుగు రోజులు కష్టపడి అన్నీ వీడియోలూ మళ్లీ అప్ లోడ్ చేశాను కానీ ఇది ఒరిజినల్ గా తయారు చేసినది కూడా నా హార్డ్ డిస్క్ లో మిగిలి లేకపోవడం వల్ల దీన్ని అప్ లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు మీరు చెబితేనే ఈ విషయం నా దృష్టికి వచ్చింది. ఈ పోస్ట్ ని తొలగిస్తాను. ధన్యవాదాలు. ఇకపోతే నా టెక్నికల్ వీడియోలూ పోస్టులన్నీ http://computerera.co.in/blog అనే లింక్ లోనే ఇకపై కొనసాగుతాయి. అలాగే మనసులో పోస్టులన్నీ http://nallamothusridhar.com అనే సైట్ లోనే కొనసాగుతాయి. మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు.